దేశీయ స్టాక్ మార్కెట్లకు మరోసారి నష్టాల బాటలో పయనించాయి. రోజంతా ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరికి స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఐటీ, మెటల్, ఫార్మా, రియాలిటీ, హెల్త్ కేర్ రంగాల్లో షేర్లలో కొనుగోళ్లు కనిపించగా… బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 112 పాయింట్లు నష్టపోయి 73,085 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 22,119 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.31గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో అల్ట్రా టెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleకొత్త జెర్సీతో కోల్ కతా నైట్ రైడర్స్… కెప్టెన్ గా రహానే, వైస్ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యర్
Next Article రైల్వే ఐ.ఆర్.టీ.సీ, ఐ.ఇర్.ఎఫ్.సీలకు నవరత్న హోదా..!