రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 40,336 వ్యవసాయ కనెక్షన్ లు మంజూరు చేశామని తెలిపారు.కాగా 22,709 కనెక్షన్ లు రైతులకు ఇచ్చి,ఇప్పటికే వినియోగంలోకి తెచ్చామని తెలిపారు.ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కు రూ. 2.60 లక్షలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
అయితే ఉచిత విద్యుత్ కు రూ. 12,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో వేర్వేరు రేట్లకు ట్రాన్స్ ఫార్మర్లు కొనుగోలు చేశారని…ఇకపై అలా జరగకుండా చూస్తామని గొట్టిపాటి అన్నారు.అలానే ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేసి వివరాలు ఇస్తే…కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఇస్తామని వెల్లడించారు.అదేవిధంగా డిస్కమ్ ల మధ్య రేట్లలో అంతరం లేకుండా చూస్తామని చెప్పారు.