దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు తెర దించుతూ నేటి ట్రేడింగ్ లో భారీ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆద్యంతం అదే జోరును కనబరిచాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వంటి కారణాలు మార్కెట్లకు కలిసొచ్చాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 740 పాయింట్లు లాభంతో 73,730 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 254 పాయింట్లు లాభపడి 22,337 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.04గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Previous Articleజనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు
Next Article ఫైనల్ లో న్యూజిలాండ్: సెమీస్ లో సౌతాఫ్రికా పై విజయం