సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ తో భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక టీమ్ స్కోరు. అత్యధిక స్కోరు (287) కూడా గతేడాది ఆ జట్టే చేయడం గమనార్హం. ఇక ఈరోజు హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఇషాన్ కిషన్ 106 నాటౌట్ (47; 11×4, 6×6) విధ్వంసకర ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. ట్రావిస్ హెడ్ 67(31; 9×4, 3×6), హెన్రిక్ క్లాసీన్ 34 (14; 5×4, 1×6), నితీష్ రెడ్డి 30 (15; 4×4, 1×6), అభిషేక్ శర్మ 24 (11; 5×4) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3 వికెట్లు, తీక్షణ 2 వికెట్లు, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఇక ఈ భారీ టార్గెట్ ను ఛేజింగ్ చేయడంలో రాజస్థాన్ కూడా గట్టిగానే పోరాడింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ (1), రియాన్ పరాగ్ (4), నితీష్ రాణా (11) స్వల్ప పరుగులు మాత్రమే చేశారు. సంజు శాంసన్ 66 (37; 7×4, 4×6), ధ్రువ్ జురెల్ 70 (35; 5×4, 6×6), షిమ్రోన్ హెట్మేయర్ 42 (23; 1×4, 4×6), శివమ్ దూబే 34 నాటౌట్ (11; 1×4, 4×6) రాణించారు. దీంతో సన్ రైజర్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Previous Articleమాజీ మంత్రి విడదల రజినీ మీద ఏసీబీ కేసు:స్పందించిన రజినీ
Next Article అన్నామలై వ్యాఖ్యలపై స్పందించిన డీకే శివకుమార్