బీహార్ సీఎం నీతీశ్ కుమార్ పై ఎలక్షన్ స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ ఈవెంట్స్, మీడియా సమావేశాల్లో సీఎంను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టి నుండి తప్పించుకునేందుకే సీఎం సన్నిహితులు ఇలా చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మానసిక స్థితిపై వైద్య నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నితీశ్ ఆయన క్యాబినెట్ మంత్రుల పేర్లు, పర్యటనలు చేస్తున్నప్పుడు జిల్లాల పేర్లు కూడా మర్చిపోతున్నారని అన్నారు. ఇటీవల బీ.పీ.ఎస్.సీ ఎగ్జామ్స్ పై జరిగిన ఆందోళనల సమయంలో బీహార్ లో ఏం జరుగుతుందోననే దానిపై ఆయనకు తెలియదనే విషయం తనకు తెలిసిందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. నితీష్ హెల్త్ కు సంబంధించి బులెటిన్ విడుదల చేస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయన్నారు. కాగా, సీఎం అటువంటి వాటికి అసలు అంగీకరించరని అన్నారు. సీఎం నితీశ్ మానసిక ఆరోగ్యంపై ఆయన సన్నిహితుడు సుశీల్ మోడీ 2023లో మొదటి సారి ఆందోళన వ్యక్తం చేశారని గడిచిన రెండేళ్లుగా ప్రజలు కూడా ఆయన పరిస్థితిని చూస్తున్నారని పేర్కొన్నారు.
నితీశ్ ఆరోగ్య పరిస్థితి వెల్లడించాలి:బీహర్ సీఎంపై ప్రశాంత్ కిశోర్ తీవ్ర వ్యాఖ్యలు
By admin1 Min Read