చెన్నై సూపర్ కింగ్స్:103-9 (20).
కోల్ కతా నైట్ రైడర్స్:107-2 (10.1).
ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆ జట్టు ఐదో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ధోనీ కెప్టెన్ గా తిరిగి పగ్గాలు చేపట్టగా చెన్నై వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై పేలవ ఆటతీరుతో 8 వికెట్ల తేడాతో ఓడిపోయి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా చెన్నైకు మొదటి బ్యాటింగ్ ఇచ్చింది. శివమ్ దూబే (31 నాటౌట్), విజయ్ శంకర్ (29) మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ కూడా మంచి ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్ కతా బౌలర్లు ధాటికి పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. నరైన్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, హార్షిత్ రాణా 2 వికెట్లు, వైభవ్ అరోరా, మొయిన్ అలీ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 10.1 ఓవర్లలోనే ఛేదించింది. సునీల్ నరైన్ 44 (18; 2×4, 5×6), డికాక్ 23 (16; 3×4), అజింక్య రహానే 20 నాటౌట్ (17; 1×4, 1×6) రాణించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

