తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే కలసి ప్రజా క్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని ఎన్డీయేలో కీలక నేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ – అన్నాడీఎంకే కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడపాడి కె.పళనిస్వామి పేరును ప్రకటించారు. పాలనాపరమైన అనుభవం ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తామని తమిళనాడు ప్రజలకు కూటమి తెలియచేసిందని పేర్కొన్నారు. పళనిస్వామి గారికి అభినందనలు. ఎన్.డి.ఎ. పాలన విధానాలు ద్వారా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుంది. తమిళనాడు రాష్ట్రానికి ఎన్.డి.ఏ. కూటమి ద్వారా కచ్చితంగా మేలు చేకూరుతుందని పవన్ అన్నారు.
బీజేపీ – అన్నాడీఎంకే కూటమికి శుభాకాంక్షలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్
By admin1 Min Read
Previous Articleకాంపా బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్
Next Article చెన్నైకు ఐదో ఓటమి… కోల్ కతా చేతిలో ఘోర పరాజయం

