తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తిరునల్వేలి శాసనసభ్యుడు నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఈమేరకు ప్రకటన చేశారు. 2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకే ఇటీవలే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ సమీపం వడివీశ్వరంలో 1960లో నాగేంద్రన్ జన్మించారు. ఆయన మొదట అన్నాడీఎంకేలో ఉండగా, ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2020 జులై నుండి ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాలలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు