దిగ్గజ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ త్వరలో రాజ్యసభ సభకు వెళ్లనున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ దీనిపై కీలక ప్రకటన చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో తాజాగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న తంగవేల్ మీడియాతో మాట్లాడుతూ, కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. త్వరలో రాజ్యసభ సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని ఆయన స్పష్టం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపెట్టుకున్న మక్కళ్ నీది మయ్యం పార్టీకి రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరింది. డీఎంకేకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం జులైలో ముగియనుంది. ఒకరి స్థానంలో కమల్ హాసన్ కు అవకాశం కల్పించవచ్చని వార్తలు వస్తున్నాయి.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

