ఉగ్రవాద చర్యలను అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవల జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని అత్యంత “ఘోరమైన చర్య”గా అభివర్ణిస్తూ, ఉగ్రవాదంపై పోరులో భారత్ కు తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. తాజాగా వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ఈ విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. అన్ని రకాలుగా ఈ విషయంలో మేం భారత్‌కు అండగా నిలుస్తామని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలనే మరోసారి నొక్కి చెప్పారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు . గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు . ఈ ఘోరానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బ్రూస్ అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు