భారత్ జావెలిన్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ఇచ్చారు. ఈమేరకు రక్షణా మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే నీరజ్ చోప్రా ఆర్మీ లో సుబేదార్ మేజర్ గా ఉన్నాడు. 27 సంవత్సరాల అతను 2020 టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్, 2024 పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2023 వరల్డ్ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు. ఇక 2011లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రదానం చేసిన విషయం విదితమే.
జావెలిన్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదా
By admin1 Min Read