ఐపీఎల్ సీజన్ 18 లోకి పంజాబ్ కింగ్స్ దూసుకెళ్లింది. తాజాగా ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహాల్ వధేరా 70 (37; 5×4, 5×6), శశాంక్ సింగ్ 59 (30; 5×4, 3×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రేయాస్ అయ్యర్ (30), అజ్మతుల్లా (21 నాటౌట్), ప్రభ్ సిమ్రాన్ (21) పరుగులు చేయడంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు, మెపాకా, రియాన్ పరాగ్, ఆకాష్ మధ్వానీ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. యశస్వీ జైశ్వాల్ 50 (25; 9×4, 1×6), వైభవ్ సూర్యవన్షీ 40 (15; 4×4, 4×6) ఆ జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చారు. ధ్రువ్ జురెల్ 53 (31; 3×4, 4×6) పోరాడాడు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. హార్ ప్రీత్ బ్రార్ 3 వికెట్లు, మార్కో జాన్సన్ 2 వికెట్లు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు పడగొట్టారు.
Previous Articleఆగష్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం అమలు
Next Article ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ సూపర్ విక్టరీ