మరికొద్ది రోజుల్లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. ఈనేపథ్యంలో భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ పై ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ పొగడ్తలుకురిపించాడు. అతను చాలా తెలివైన బౌలరని, అతడి నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు తెలిపాడు. అశ్విన్ గొప్ప బౌలర్ అని దాదాపు తన కెరీర్ అంతా అతడితో తలపడ్డట్లు లైయన్ పేర్కొన్నాడు. అతడి నుంచి చాలా నేర్చుకున్నా. అశ్విన్ చాలా తెలివైన బౌలర్. పరిస్థితులకు చాలా త్వరగా అలవాటుపడతాడు. అత్యుత్తమ బౌలర్లే అలా చేయగలుగుతారని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ తన నైపుణ్యంతో తాను లాభపడడమే కాకి జట్టుకూ లాభాన్ని చేకూర్చాడని ప్రశంసించాడు. 2020/21లో అతడే అత్యుత్తమ బౌలర్ అని లైయన్ పొగడ్తలుకురిపించాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కోసం పర్యటించడం అశ్విన్ కు ఇది అయిదోసారి. అక్కడ అతడు 10 టెస్టుల్లో 39 వికెట్లు పడగొట్టాడు.ఒకే ఏడాదిలో అరంగేట్రం చేసిన అశ్విన్, లైయన్ బోర్డర్-గావస్కర్ సిరీస్లో మొత్తం ఎనిమిదిసార్లు తలపడ్డారు. అశ్విన్ తనకెంతో నేర్పించాడని లైయన్ పేర్కొన్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు