బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా అమెరికాలో కటకటాల పాలయ్యారు.తన మాజీ ప్రియుడితోపాటు,అతడి స్నేహితురాలిని హత్య చేసిన ఆరోపణలతో ఆమెను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.న్యూయార్క్‌లో ఉంటున్న అలియా గత కొంతకాలంగా ఎడ్వర్డ్ జాకోబ్‌తో డేటింగ్‌లో ఉన్నారు.అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.ఈ క్రమంలోనే జాకోబ్ మరో అమ్మాయితో రిలేషన్ మొదలుపెట్టాడు.ఈ విషయం తెలిసి అలియా ఆగ్రహానికి గురయింది.జాకోబ్‌తోపాటు ఆయన స్నేహితురాలిని పలుమార్లు హెచ్చరించింది. ఇటీవల వారి ఇంటికి నిప్పటించింది.ఈ ప్రమాదంలో జాకోబ్,ఆయన స్నేహితురాలు కన్నుమూశారు.ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాగ్మూలం మేరకు అలియాపై కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఆమె కనుక దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
Previous Articleపెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Next Article హరీశ్ రావుపై కేసు నమోదు…!