బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (డే/నైట్) మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (13) వికెట్ ను కోల్పొయింది. ప్రస్తుతం నాథన్ మెక్‌స్వీనీ 38 బ్యాటింగ్ (97,6×4), మార్నస్ లబుషేన్ 20 బ్యాటింగ్ (67, 3×4) క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఇంకా 94 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేసింది. మొత్తంగా మొదటి రోజు ఆధిపత్యం కనబరిచింది. ఇక అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. నితీష్ రెడ్డి 42 (54; 3×4, 3×6) టాప్ స్కోరర్. కే..ఎల్.రాహుల్ 37 (64;6×4),గిల్ 31 (51; 5×4), అశ్విన్ 22(22; 3×4) , పంత్ 21(35;2×4) పర్వలేదనిపించారు. జైశ్వాల్ 0, రోహిత్ శర్మ (3), కోహ్లీ (7) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో చెలరేగాడు. పాట్ కమ్మిన్స్ 2 వికెట్లు, స్కాట్ బొలాండ్ 2 వికెట్లు తీశారు.
Previous Articleవారాంతంలో స్వల్ప నష్టాలతో తగ్గిన సూచీల జోరు..!
Next Article అండర్-19 ఆసియా కప్ లో ఫైనల్ కు చేరుకున్న భారత్