అండర్-19 ఆసియా కప్ లో భారత్ ఫైనల్ చేరింది. నేడు శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్ లో 7 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ వేటలో దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటయింది. లక్విన్ (69) అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. షరుజన్ (42) పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో చేతన్ శర్మ 3 వికెట్లు, కిరణ్ 2 వికెట్లు, ఆయుష్ 2 వికెట్లు, హార్దిక్, గుహా చెరో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో భారత్ 21.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్య వంశీ 67(36; 6×4, 5×6) అదరగొట్టాడు. ఆయుష్ మాత్రే 34(28;7×4) రాణించాడు. సిద్దార్థ్ (22), మహామ్మద్ అమన్ (25 నాటౌట్), కార్తీకేయ (11 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో వీరణ్ చముదిత, ప్రవీణ్, విహాస్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. దుబాయ్ వేదికగా జరుగనున్న ఫైనల్ లో బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు