కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా విజయవాడ లోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో చేపట్టిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులు, పర్యాటక శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. కర్ణాటక సంగీతంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాలను, తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి గల గాఢ అనుబంధాన్ని చాటిచెప్పే ఉత్సవం కృష్ణవేణి సంగీత నీరాజనం అని ఆయన పేర్కొన్నారు. అందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి జీవం పోయడంలో కృషి చేసిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లు, రాష్ట్ర టూరిజం శాఖ అంతేకాకుండా ఎంతో అంకిత భావంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సంగీత పర్యాటకం, వారసత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రోజుల పాటు కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్ పర్సన్ తేజస్విని పొడపాటి తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు