ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో 11వ గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ పై గెలిచి 6-5తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ తాజాగా జరిగిన 12 వ గేమ్ లో ఓటమి చెందాడు. దీంతో ఇరువురు ఆటగాళ్లు మళ్లీ 6-6 సమమయ్యారు. గడిచిన రౌండ్లలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న గుకేశ్ ఈ రౌండ్ లో స్థాయికి తగిన విధంగా రాణించలేకపోయాడు. ఇక ఈ ఛాంపియన్ షిప్ లో ఇంకా 2 రౌండ్లు మిగిలి ఉన్నాయి.
ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించి సమం చేశాడు. ఆతర్వాత నుండి వరుసగా 7 డ్రా లతో ఈ ఛాంపియన్ షిప్ సాగింది. మొత్తం 8 గేమ్ లు డ్రా అయ్యాయి.
Previous Articleకుమారుడికి అనారోగ్యం .. 110 మందిని చంపిన తండ్రి
Next Article రసవత్తరంగా మారిన డబ్ల్యూటీసీ రేసు