బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ రేసు రసవత్తరంగా సాగుతోంది. తాజాగా సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరుకుంది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో గెలిచి 63.33% తో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్ గెలిస్తే సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. త్వరలో పాక్-సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగనుంది. ఇక ఆస్ట్రేలియా ప్రస్తుతం 60.71% తో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. భారత్ 57.29%తో మూడో స్థానంలో ఉంది. మరోవైపు శ్రీలంక ఫైనల్ రేసులో 45.45% వెనుకబడింది. దీంతో ప్రధానంగా పోటీ సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా-భారత్ లో మధ్యే ఉంది.
ఆసీస్ తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది. 3-2 తో గెలిచిన 3-1తో గెలిచినా ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. కాబట్టి భారత్ మిగిలిన మ్యాచ్ లలో గెలుపు కీలకంగా మారింది. మరోవైపు శ్రీలంకతో ఆస్ట్రేలియాకు రెండు టెస్టుల సిరీస్ ఉంది.
Previous Articleప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్: మళ్లీ సమంగా నిలిచిన గుకేశ్, లిరెన్
Next Article జపాన్‌లో ఒక్కరోజు విద్యార్థి @ రూ.17 వేలు