భారత మహిళా క్రికెట్ లో కీలక గుర్తింపు పొందిన పేసర్ జులన్ గోస్వామి పేరును దేశంలోని ప్రతిష్టాత్మక మైదానాల్లో ఒకటైన ఈడెన్ గార్డెన్స్ లోని ఒక స్టాండ్ కు పెట్టనున్నారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తాజాగా ఈ విషయం అధికారికంగా ప్రకటించింది. భారత క్రికెట్ కు ఆమె అందించిన సేవలకు గాను ఆమెకు ఈ గౌరవం లభించింది. జులన్ గోస్వామి భారత్ తరపున 204 వన్డేలకు, 68 టీ20లు, 12 టెస్టులు ఆడింది. వన్డేల్లో 255 వికెట్లు, టీ 20లలో 56 వికెట్లు, టెస్టులలో 44 వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించింది. ఆమెతో పాటు భారత సైన్యంలో విశేష సేవలందించిన కల్నల్ ఎన్.జే.నాయర్ పేరును కూడా ఓ స్టాండ్ కు పెట్టాలని నిర్ణయించారు. ఆయన అశోక చక్ర, కీర్తి చక్ర పురస్కారాలు అందుకున్నారు. ఇక జులన్ గోస్వామి దీనిపై స్పందిస్తూ ఒక స్టాండ్ కు తన పేరు పెట్టడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

