కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమిలి ఎన్నికల బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో కొందరు ఎంపీలు సభకు రాకపోవటాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించనుంది.అయితే వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.20 మందికిపైగా ఎంపీలు లోక్‌సభకు గైర్హాజరైనట్లు తెలుస్తుంది.ఈ మేరకు జమిలి ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో తమ పార్టీ ఎంపీలందరూ సభలో ఉండాలని బీజేపీ విప్ జారీ చేసింది.అయితే రెండు బిల్లులు ఆమోదం పొందటానికి బీజేపీ ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాకపోయినా ప్రభుత్వానికి తగినంత మద్దతు లేదని విమర్శించటానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినట్లు అయిందని బీజేపీ అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది.
జమిలీ ఎన్నికల కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.అయితే ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.ఈ క్రమంలోనే ఓటింగ్ జరపాలని పట్టుబట్టాయి.అయితే బిల్లుపై ఓటింగ్‌కు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు.కాగా హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు.360 మంది ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు.ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుకూలంగా 269 మంది వేయగా,వ్యతిరేకంగా 198 మంది ఓట్లు వేశారు.లోక్ సభో ఓటింగ్ నిర్వహించిన సమయంలో కొంతమంది బీజేపీ ఎంపీలు గైర్హాజరైయ్యారు.దీనితో బిల్లుపై బీజేపీకి అనుకున్న దాని కంటే తక్కువ మద్దతు రావడంతో బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది అని తెలుస్తుంది.