పైప్ లైన్లు ద్వారా గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు రమణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో భేటీ అయింది. రాష్ట్రంలో చేపట్టిన గ్యాస్ పైప్ లైన్లు నిర్మాణ ప్రాజెక్టుల గురించి చర్చింది.
గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్-టెక్ సిటీ లో గ్యాస్, విద్యుత్, టెలికం కేబుళ్లు మొత్తం భూగర్భంలోనే ఉంటాయి. ఆ నగరంలో అన్ని ఇళ్లకూ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. అదే విధంగా అమరావతికి పైపులైన్ ద్వారా గ్యాస్ అందించి, దేశంలో మొట్టమొదటి పైప్ ద్వారా గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా చేసే ప్రతిపాదన చేయగా ఈ ప్రతిపాదనకు సీఎస్ అంగీకారం తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు