అల్లు అర్జున్ అసలైన వ్యక్తిత్వం గురించి ఏంఐఏం ఎమెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ఆయన తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ…సంధ్య థియేటర్ ఘటన గురించి చెబితే పెద్దగా బాధపడకుండా సినిమా గురించి మాత్రమే సన్నిహితులతో చర్చించిన దుర్మార్గుడంటూ అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు.పుష్ప సినిమా విడుదల రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని పక్కనున్న వాళ్లు చెబితే…’అయితే మన సినిమా హిట్ అయినట్టే’ అంటూ సంతోషం వ్యక్తి చేసినట్లు సన్నిహితుల ద్వారా తనకు తెలిసిందన్నారు.పోలీసులు చెబుతున్న వినకుండా హీరోయిజం చూపించేందుకు వచ్చి రేవతి కుటుంబంలో తీరని శోఖం మిగిల్చారు.
బయట మహిళా అభిమాని చనిపోయింది.చిన్న పిల్లవాడు చావు బతుకుల్లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నా పట్టించుకోలేదు.తొక్కిసలాట గురించి సమాచారం ఇస్తే.. ‘అయితే మన సినిమా హిట్ అయినట్టే’ అంటూ సంబరాలు చేసుకున్నాడు.అంతటితో ఆగకుండా వెళ్లిపోవాలని చెప్పినా వినకుండా.. సినిమా మొత్తం చూశాడు.బయటకొచ్చి కార్ రోప్ ఎక్కి చేతులూపుతూ హంగామా చేశాడు.మానవత్వం లేకుండా వ్యవహరించాడు’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.

