ఇటీవల ‘తండేల్’ తో అలరించిన అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఇది చైతూకు 24వ మూవీ (ఎన్‌సీ24). ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన మూవీ ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్స్, నాగచైతన్య లుక్, తదితర విషయాలను ప్రేక్షకుతో పంచుకున్నారు. పలు విషయాలతో తీర్చిదిద్దిన వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ మూవీకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Previous Articleఉగ్రవాదుల రహాస్య స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతా బలగాలు
Next Article మాడ్రిడ్ ఓపెన్ లో మొదటి రౌండ్ లోనే ఓడిన జకోవిచ్