దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్ ను స్వల్ప నష్టాలతో ముగించాయి. ఉదయం లాభాల్లో కదలాడినా సెషన్ చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా కొద్ది నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 78,472 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 27 పాయింట్ల నష్టంతో 23,727 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.18గా కొనసాగుతోంది. ఐటీసీ, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టీ.సీ.ఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Previous Articleప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీపై మంచు పరదాలు: భారీగా పర్యాటకులు
Next Article అల్లు అర్జున్ విచారణ పూర్తి.. తొలగిన పరదాలు