సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2 కోట్లు సాయం అందజేయనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. ఘటనలో గాయపడి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. పుష్ప-2 చిత్రం నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ తరపున చెరో రూ.50 లక్షలు, అల్లు అర్జున్ తీర్పును రూ.కోటి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈమేరకు సంబంధిత చెక్ లను ఎఫ్.డి.సీ ఛైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. శ్రీ తేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని త్వరలో మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Previous Articleసూర్య కొత్త చిత్రం టైటిల్ టీజర్
Next Article ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు