బాలీవుడ్ నటుడు సోనూసూద్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.కీలక విషయాలు వెల్లడించారు.రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టే అవకాశాలు వచ్చినట్లు తెలిపారు.తానే వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు.”దేశంలోనే మంచి పేరున్న కొందరు,కొన్ని పార్టీలు సీఎం బాధ్యతలు చేపట్టమని నాకు అవకాశం ఇచ్చారు.కానీ, నేను దాన్ని తిరస్కరించా.దీంతో డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఆఫర్లు కూడా ఇచ్చారు.రాజకీయాల్లో ఉంటే దేని కోసం మనం పోరాడాల్సిన అవసరం లేదని చెప్పారు.అయితే..వారిచ్చిన అవకాశాలను స్వీకరించలేకపోయా” అని తెలిపారు.ప్రజాసేవ చేయడం తనకు ఇష్టం అని ఆయన అన్నారు.రాజకీయాల్లో ఉంటే జబాబుదారీ తనంతో ఉండాలని అది తనకు భయంగా ఉంటుందని ఆయన చెప్పారు.
Previous Articleరేపు పూర్తి అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
Next Article అన్ని వర్గాలకు వైసీపీ అండగా ఉంటుంది: మాజీ సీఎం జగన్