మాజీ ప్రధాని,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం అత్యంత బాధాకరమని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు.ఆయన భారత దేశ ఆర్థికశిల్పి అని ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో మన్మోహన్ సింగ్ ఉన్న ఫోటోను తన పోస్ట్ కు జత చేశారు.
రెండు సార్లు దేశ ప్రధానిగా, అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, మన దేశానికి సింగ్ జి అందించిన సేవలు అమూల్యమని కొనియాడారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో మన్మోహాన్ సింగ్ సంస్కరణలు కీలకం. ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధిక మాంద్యం ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడకుండా గాడిలో పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిదేనని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం మన దేశ పౌరుల హక్కులను కాపాడితే, ఉపాధి హామీ పథకం నిరుపేదల జీవితాలకు మార్గదర్శి అయ్యింది. ఆ మహనీయుడి సంస్కరణలు, సాధించిన విజయాలు మన దేశ ప్రతి పౌరుడికి ఆదర్శమని ఆమె స్పష్టం చేశారు.
ఆయన సంస్కరణలు, సాధించిన విజయాలు మన దేశ ప్రతి పౌరుడికి ఆదర్శం: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read