భారత్ అభివృద్ధి ప్రయాణంలో సైన్యం పాత్ర కీలకమని కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.భారత భద్రతా వ్యవస్థపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రత విషయంలో మనం అంత అదృష్టవంతులం కాదని బయట మరియు అంతర్గతంగా శత్రువుల కదలికలపై దృష్టి ఉంచాలని సైన్యానికి సూచించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలోని మావ్ కంటోన్మెంట్ వద్ద ఆర్మీ సిబ్బందిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మీరు తీసుకుంటున్న కఠినమైన శిక్షణతో పాటు మీ అంకితభావాన్ని ఇక్కడికి వచ్చినప్పుడల్లా తాను చూస్తున్నానని దేశం పట్ల బాధ్యతాయుతమైన మీ తీరు మాలో స్ఫూర్తి నింపుతోందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
దేశ భద్రత గురించి తీసుకుంటే మనం అంత అదృష్టవంతులం కాదు. ఎందుకంటే ఉత్తర, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. మరోవైపు అంతర్గతంగానూ భద్రతా పరమైన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. శత్రువులు కార్యకలాపాలపై మరింత నిఘా అవసరమని పేర్కొన్నారు. వారి కదలికలను గమనిస్తూనే ఉండాలని సూచించారు. అప్పుడే వారి కుట్రను భగ్నం చేయగలమని రాజ్ నాథ్ సింగ్ సైనికులకు సూచించారు. మావ్లోని అడ్వాన్స్డ్ ఇంక్యుబేషన్ & రీసెర్చ్ సెంటర్ని ఆయన సందర్శించారు. మన రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి భారత సైన్యం ఆధునిక సాంకేతికతలపై శ్రద్ధ పెడుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…మనం అదృష్టవంతులం కాదు: రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్
By admin1 Min Read
Previous Articleపీ.ఎస్.ఎల్.వీ సీ-60 రాకెట్ ప్రయోగం నేడే
Next Article అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

