కేరళలోని ప్రఖ్యాత క్షేత్రం శబరిమల ఆలయం రానున్న మకరజ్యోతి పండుగను పురస్కరించుకొని ఈరోజు నుండి తెరుచుకోనుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్ రాజీవరు నేతృత్వంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు మేళశాంతి ఎస్ అరుణ్‌కుమార్ ఆలయాన్ని తెరుస్తారని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది జనవరి 14న సంక్రాంతి నాడు భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. భారీ సంఖ్యలో స్వాములు, భక్తులు జ్యోతి దర్శనంలో పాల్గొంటారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
Previous Articleఅమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత
Next Article క్యూట్ నెస్ తో మది గెలిచిన అలియా కుమార్తె రాహ…!