అఫ్గానిస్థాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు అక్కడి మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్నారు.తాజాగా ఆ దేశ పాలకులు తీసుకువచ్చిన కొత్త నియమాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.నూతనంగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించేలా వంట గదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.వంట గదులు,ఇంటి ఆవరణ,నీటికోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయటివారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే వీలుంది. వారు కనిపించకుండా గోడలు కట్టాలి.ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలి’’ అని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Previous Articleనష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Next Article బోర్ బావిలో బాలికకు అడ్డుగా బండరాయి