విశాఖపట్నం జైలు ఖైదీలతో కిక్కిరిసిపోతోంది.950 మంది ఖైదీలను ఉంచగల సామర్థ్యం మాత్రమే ఉండగా ప్రస్తుతం 2,076 మంది ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు.ఈ జైలు సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచడంతో పర్యవేక్షణ, వసతుల కల్పన సవాలుగా మారిందని చెబుతున్నారు.ఇప్పుడు ఉన్న ఖైదీలలో శిక్ష ఖరారైన వారి సంఖ్య 440 మాత్రమేనని,మిగతా వారంతా రిమాండ్ ఖైదీలేనని తెలిపారు.ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గదులు సరిపోవడంలేదని, ఇరుకు గదిలో ఇబ్బంది పడుతున్నానంటూ ఓ ఖైదీ తన బంధువులకు చెప్పాడు.దీంతో ఖైదీ బంధువులు ఇటీవల జైలు ఎదుట ఆందోళన చేశారని సమాచారం.ఈ మేరకు 200 మంది ఖైదీలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Previous Article2024లో విద్యుత్తు ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి అంటే?
Next Article మను బాకర్, గుకేశ్‌లకు ఖేల్ రత్న…!