2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘం నియమించిన సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో బెంగళూరులో ఈ బృందం పర్యటించింది. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో సమావేశమైంది.
స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిగారు, హోమ్ మంత్రి అనిత గారు, ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే కలిసి ఈ పథకం అమలు చేయడం వల్ల అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం,లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు