మెడికల్ సీట్ల భర్తీ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లు ఖాళీగా ఉండటానికి వీల్లేదని పేర్కొంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
వైద్య విద్యకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో దాదాపు వెయ్యికిపైగా సీట్లు ఖాళీగా ఉండటంపై ఏప్రిల్ 2023లో సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ఓ వైపు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యుల కొరత ఉండటం,మరోవైపు ఇలా సీట్లు మిగిలిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.దీంతో చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది.