దేశంలో మూడు హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV) కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై మాట్లాడారు. ఈ వైరస్ కొత్తదేం కాదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆరోగ్యపరమైన సవాళ్లపై తక్షణ స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వైరస్ కాదని ఆరోగ్య రంగ నిపుణులు స్పష్టంచేశారు. ఈ వైరస్ ను 2001లోనే గుర్తించారు. చాలా ఏళ్లుగా ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది. గాలి, శ్వాసప్రక్రియ ద్వారా ఇది వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారినీ ఇది ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం చైనాలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్యమంత్రిత్వశాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని త్వరలోనే నివేదికను వెలువరించనుంది. ఐసీఎంఆర్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ తో దేశంలోని శ్వాసకోశ వైరస్లకు సంబంధిత డేటాను సమీక్షించాయి. సాధారణ వ్యాధికారక వైరస్ లలో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదు. ఈ పరిస్థితిపై సమీక్షించేందుకు జనవరి 4న డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఫర్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ సమావేశం జరిగింది. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్వర్క్ లు అప్రమత్తంగా ఉన్నాయి. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
In a statement today, Union Health Minister, Shri @JPNadda has assured that there is no cause for any concern regarding #HMPV cases.
He stated that that the virus was already identified in 2001 and is not new. The virus is said to spread mainly during winter and early spring.… pic.twitter.com/ypIvcYkSLz
— Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2025