తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే సంక్రాంతి పండుగ కోసం పల్లెలు సరికొత్త వెలుగులతో తమ వారికి ఆహ్వానం పలుకేందుకు సమాయత్తం అవుతున్నాయి. బతుకు తెరువు కోసం సొంత ఊరిని వదిలి దూరంగా బతుకుతున్న వారు తిరిగి తమవారిని కలుసుకునేందుకు ఆరాటపడుతూ పల్లెబాట పడుతున్నారు. ఇక ఈ పండుగ రద్దీ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు పెంచింది. 7,200 బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రత్యక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ముందుగా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపింది.
Previous Articleఆస్కార్ -2025 అవార్డు బరిలో 6 భారతీయ చిత్రాలు…!
Next Article లాభాలతో మార్కెట్ కు జోష్..!