లాస్ ఏంజెలిస్ కార్చిచ్చు హాలీవుడ్ లోని ఐకానిక్ నిర్మాణాలను కాల్చి బూడిద చేసే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ ను కూడా అక్కడి అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది.దీనితో ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యం కానుంది.కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్ హిల్స్ ను ఖాళీ చేయిస్తున్నారు.చాలామంది సినీతారలు ఇళ్లను, సంపదను కోల్పోయారు.మొత్తంగా 2000 నిర్మాణాలు దగ్ధమైనట్లు లెక్కలు చెబుతున్నాయి.ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.దాదాపు 1.3 లక్షల మంది ఇళ్లను ఖాళీ చేయించారు.
Previous Articleసోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన నిధి అగర్వాల్
Next Article కార్చిచ్చు… బైడెన్ కుమారుడి ఇల్లు దగ్ధం