ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్ గురించి,కాంగ్రెస్ నాయకురాలు,ఎంపీ ప్రియాంకాగాంధీ గురించి బీజేపీ నేత రమేశ్ బిధూరీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.అతడినే బీజేపీ తన సీఎం అభ్యర్థిగా ప్రకటించనుందని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ తెలిపారు.రాబోయే ఒకటి రెండు రోజుల్లో బీజేపీ తన సీఎం అభ్యర్థిగా రమేశ్ బిధూరీ పేరు అధికారికంగా ప్రకటించనున్నట్టు తమకు సమాచారం అందిందని కేజ్రీవాల్ తాజాగా ప్రెస్ మీట్ లో చెప్పారు.
బీజేపీ సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగనున్న రమేశ్ బిధూరీకి నా అభినందనలు.అయితే ఆయన ఒక ఎంపీగా ఢిల్లీ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి.ఢిల్లీ పట్ల ఆయనకున్న విజన్ ఏమిటో వెల్లడించాలి.ఆయన పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఢిల్లీ ప్రజల ముందు బీజేపీ, ఆప్ సీఎం అభ్యర్థుల మధ్య చర్చ జరగాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 న జరగనున్నాయి.8వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయి.