గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ విజయంతో మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి జో బైడను దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ కీలక చర్యలు వ్యాఖ్యలు చేశారు.అధ్యక్ష ఎన్నికల పోటీల్లో తాను నిలబడి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడినని వ్యాఖ్యానించారు.మీడియా సమావేశంలో ‘ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయంపై విచారిస్తున్నారా..? మీ నిర్ణయం ట్రంప్ గెలుపుకు దోహదపడిందని మీరు అనుకుంటున్నారా..? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి అధ్యక్షుడు బదులిస్తూ…తాను అలా ఏమీ అనుకోవడం లేదన్నారు.తాను మొన్నటి ఎన్నికల బరిలో దిగి ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓండిచేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు.డెమోక్రటిక్ పార్టీలో ఐక్యత కోసమే తాను అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు.ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించగలదని తాను భావించినట్లు చెప్పారు.అందుకే అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు మద్దతిచ్చినట్లు బైడెన్ చెప్పుకొచ్చారు.అందుకు కమలా సైతం తీవ్రంగా కృషి చేసినట్లు బైడెన్ వివరించారు
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు