యుద్ధనౌకలు ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్ లను, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణా శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకాదళ శక్తిగా భారత్ ఎదుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. ఈ మూడిటి చేరికతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత పెరగనుందని మోడీ తెలిపారు. గత పదేళ్లలో నౌకాదళంలోకి 33 యుద్ధనౌకలు, ఏడు జలాంతర్గాముల చేరాయని వివరించారు. ఈ మూడు కూడా భారత్ లోనే తయారుచేసినవేనని చెప్పారు. రక్షణ రంగంలో దేశం ఆత్మనిర్భర్ దిశగా కొనసాగుతోందని పేర్కొన్నారు దేశంలో తయారైన రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటినట్లు తెలిపారు . 100కుపైగా దేశాలకు రక్షణకు సంబంధించిన పరికరాలను భారత్ ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ నవీ ముంబయిలో ఇస్కాన్ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించారు.
Previous Articleఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు అందుకున్న వి.నారాయణన్
Next Article మూతపడనున్న “హిండెన్‌బర్గ్ రీసెర్చ్” సంస్థ