ఇస్రో నిర్వహించిన పరీక్షలో ఆలిండియా 9 ర్యాంకు సాధించి సైంటిస్ట్‌గా ఎంపికైన తెలుగు యువకుడు జడగం రమేష్ అనే యువకుడిని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. డ్రైవర్‌గా పని చేస్తూ తండ్రి శ్రీనివాసులు, టైలర్‌గా పనిచేస్తూ తల్లి రామలక్ష్మి తమ కుమారుడిని ఈ స్థాయికి తేవడం స్ఫూర్తిదాయకమని అన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్ మిషన్ టీమ్‌లో ఒకరిగా పనిచేసిన రమేష్, భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఈసందర్భంగా సీఎం ఆకాంక్షించారు.
ఇస్రో సైంటిస్ట్‌గా ఎంపికైన తెలుగు యువకుడు జడగం రమేష్ కు సీఎం అభినందనలు
By admin1 Min Read