ఇటీవల బాలీవుడ్ కథానాయకుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దూరి కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తి గురించి ఆసక్తికర వివరాలను వెల్లడించారు ముంబై పోలీసులు.కత్తితో పొడిచింది బంగ్లాదేశ్ కు చెందిన 30 ఏళ్ల షరీఫుల్ ఇస్లాం అని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.అయితే నిందితుడికి మహ్మద్ ఆలియన్ అనే పేరు సైతం ఉన్నట్లు కూడా పేర్కొన్నారు.నిందితుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడని,అతని లక్ష్యం ఖరీదైన వస్తువులు దొంగలించడమే అని సీనియర్ పోలీస్ అధికారి విలేకరులతో అన్నారు.థానే జిల్లాలో ఘోడ్ బందర్ రోడ్డులో హీరానందానీ ఎస్టేట్ నుండి దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
నిందితుడు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా దేశంలోకి చొరబడి తన పేరును బిజోయ్ దాస్ గా మార్చుకుని ఇక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు.దొంగతనం చేద్దామనే లక్ష్యంతో సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన షరీఫుల్ సైఫ్ ఎదురురావడంతో కత్తితో పొడిచిపరారయ్యాడు. దాడి తరువాత ముంబై పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు.తరువాత థానేలోని హీరానందానీ ఎస్టేట్ సమీపంలో ఉన్న లేబర్ క్యాంపు సమీపంలో పట్టుకున్నారు.అయితే అరెస్ట్ తరువాత పోలీసులను గందరగోళ పరిచేందుకు నిందితుడు తన పేరును బిజోస్ దాస్ అని చెప్పాడు.చివరకు నేరాన్ని కప్పిపుచ్చడానికి ఉద్దేశపూర్వకంగా పేర్లు మార్చుకున్నాడని పోలీసులు గ్రహించారు.బంగ్లాదేశ్ లోని జలోకటికీ చెందిన నిందితుడు ఐదునెలలకు పైగా ముంబైలో ఉంటూ చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నాడని దర్యాప్తులో తేలిందన్నారు.