ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై అతడి తల్లి స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా తగిన శిక్ష విధించాలని పేర్కొన్నారు. తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా కొడుకు చనిపోతే నేను ఏడుస్తా. కానీ ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకు.. సంజయ్‌కు జీవించే హక్కు లేదు. అతడికి మరణ శిక్ష విధించినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వైద్యురాలు నాకు కూతురితో సమానం. కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లీ ఊరుకోదు’’ అని ఆమె తాజాగా మీడియాతో చెప్పారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు