లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై పరువునష్టం కేసు నమోదయిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్ పై క్రిమినల్ విచారణను నిలిపివేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. బీజేపీ కార్యకర్త నవీన్ ఝా రాహుల్ పై వేసిన పరువునష్టం కేసును కొట్టివేసింది. రాహుల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం నేడు విచారించింది. రాహుల్ తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు