దక్షిణ తైవాన్‌ను భారీ భూకంపం వణికించింది. మంగళవారం తెల్లవారుజామున 12:17 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది.రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది.చియూయ్ కౌంటీ హాల్‌కు ఆగ్నేయంగా 38 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉందని తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.ఈ భూకంపం ధాటికి చియూయ్,తైవాన్ నగరాల చుట్టూ స్వల్పస్థాయిలో నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటనలో 27 మందికి స్వల్ప గాయాలైనట్లు పేర్కొంది.వారందరినీ ఆసుపత్రులకు తరలించినట్లు తైవాన్ అగ్నిమాపక విభాగం తెలిపింది. మరణాలకు సంబంధించిన ఇప్పటి వరకూ ఎలాంటి నివేదికలూ లేవు.
Previous Articleఢిల్లీలో ఆప్‌కు గట్టి షాక్..!
Next Article ట్రంప్ కార్యవర్గం నుంచి వివేక్ రామస్వామి ఔట్

