దేశీయ స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజైన నేడు ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. నష్టాల్లో కొనుగోళ్ల మద్దతు లభించినా తరువాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆద్యంతం ఒడిదుడుకుల్లో కదలాడి నష్టాలతో ముగించాయి. దీంతో వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ వేశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 329 పాయింట్లు నష్టపోయి 76, 190వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 113 పాయింట్ల నష్టంతో 23,092 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.25గా కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ లో టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleవన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024 ను ప్రకటించిన ఐసీసీ
Next Article 8 వసంతాలు టీజర్ విడుదల…!