బీజేపీ ఆర్ఎస్ఎస్ లు దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం పరిస్థితులు తీసుకురావడానికి చూస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్యానికి ముందు రాజులకు తప్ప మిగిలిన వారెవరికీ ఎలాంటి అధికారాలు లేవని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాజ కుటుంబ వారసుడు కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాజులు ప్రజలు కోసం ఏం చేశారో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బరోడా రాజు సాయాజీ రావు గైక్వాడ్ బాబా సాహెబ్ అంబేద్కర్ చదువుకు సాయం చేశారని పేర్కొన్నారు. 1902లో షాహూజీ మహారాజ్ వెనకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గ్వాలియర్ మాధవ్ మహారాజ్ వెనకబడిన తరగతుల సాధికారత కోసం విద్య, ఉద్యోగ కేంద్రాలను స్థాపించారని తెలిపారు. ధోల్పూర్ రాజ కుటుంబం సామాజిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశారని మహారాజ్ రాణా నిహాల్ సింగ్ పరిపాలనలో రహదారులు, హాస్పిటల్స్, రైల్వేలు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించారని వివరించారు. రాజులు ప్రజలకు చేసిన సేవలు విస్మరించడం రాహుల్ గాంధీ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు.
రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి, రాజ కుటుంబ వారసుడు జోతిరాదిత్య సింధియా కౌంటర్
By admin1 Min Read
Previous Articleనాగ చైతన్య “తండెల్” ట్రైలర్ విడుదల…!
Next Article రాజ్ కోట్ టీ20లో భారత్ పై ఇంగ్లాండ్ విజయం

