రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు చొప్పున శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహించనుండగా… అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు జరుగనున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు