గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకు అధికారం రావడానికి ప్రతిపక్ష కాంగ్రెస్సే కారణమంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా ‘బంగ్లార్ నిర్బచోన్ ఒ అమ్రా’ పేరుతో తాను రాసిన మూడు పుస్తకాలను ఆమె విడుదల చేశారు.ఆ పుస్తకంలో 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ చేశారు.
కాగా బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ కారణమని అందులో మమతా పేర్కొన్నారు.కేంద్రంలోని ఎన్డీయే ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఓ కూటమిగా ఏర్పడ్డాయి.అన్ని కార్యక్రమాలను ఉమ్మడిగా ముందుకుతీసుకెళ్లాయి.అయితే నాయకత్వం కోసం కూటమిలోని అభ్యర్థులు పరస్పరం పోటీకి దిగారు.తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగా ఇండియా కూటమికి గెలుపు దక్కకుండా పోయిందని విమర్శలు గుప్పించింది.మెజారిటీ రాకపోయినా బిజేపికుకు అధికారం దక్కిందని ఆమె పుస్తకంలో పేర్కొన్నారు.