కేంద్ర ప్రభుత్వం ఖలీస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్( ఎస్.ఎఫ్.జె) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ పై ఉన్న కేసుల సంఖ్యను తెలిపింది. అతనిపై 104 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ , చండీగఢ్, హర్యానా, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాలలో ఎస్.ఎఫ్.జె పై 96 కేసులు ఉన్నాయని మరో 8 కేసులు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ) విచారిస్తోందని కేంద్రం తన గెజిట్ లో పేర్కొంది. ఎస్.ఎఫ్.జెపై ఐదేళ్ల పాటు ఉన్న నిషేధాన్ని పొడిగించినట్లు ఢిల్లీ హైకోర్టుకు చెందిన ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ విషయం కేంద్రం తెలిపింది. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పన్నూ ప్రత్యక్షమవడం ఆందోళనకు కారణమైన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై భారత్ స్పందించింది. తమ దేశ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికా వద్ద ప్రస్తావిస్తూనే ఉంటామని తేల్చి చెప్పింది.
ఎస్.ఎఫ్.జె వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ పై 104 కేసులు: కేంద్రం
By admin1 Min Read